మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన వీర సింహా రెడ్డి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు నటించారు. నందమూరి బాలకృష్ణ గారు ఇందులో డ్యుయల్ రోల్ చేయడం జరిగింది. మొదటి భాగంలో బాలకృష్ణ గారి డైలాగులు ఏంతో అలరించిన కూడా రెండో భాగం కాస్త నిరుత్సాహపరిచింది. మరి ఎక్కువ గా ఎమోషనల్ సీన్లు ఉండటం వలన సాగదీసినట్టు అనిపించింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్ గారిది. NBK కార్యక్రమంలో బాలకృష్ణ గారు ' నేనూ హీరో గా నటించిన సినిమా లో వరలక్ష్మి విలన్ ఆ లేకపోతే వరలక్ష్మి విలన్ గా నటించిన సినిమా లో నేనూ హీరోనా?' అన్న డైలాగ్ కి ఏ మాత్రం తీసిపోకుండా తన నటన ఉంది. బాలకృష్ణ గారు తన శైలి లో క్లైమాక్సు డైలాగులతో ప్రేక్షకులను అలరించారు అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సందర్బంగా విడుదల అయిన వీరసింహారెడ్డి సినిమా ని జనాలు, అభిమానులు సక్సెస్ చేసినందుకు సినిమా యూనిట్ అంతా నిన్న ఆదివారం హైదరబాద్ లో సక్సెస్ మీట్ జరుపుకున్నారు. ఈ సందర్బంగా 'వీరమాస్ బ్లాక్ బస్టర్' అని విజయోస్తవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ "నటుడిగా భిన్న పాత్రలు చేస్ అవకాశం నాకు రావటం ఈ జన్మకు నాకు లభించిన అదృష్టం. ఇంకా కుర్రాడి లాగా ఉండడం వెనుక రహస్యం ఇదే " అని చెప్పారు. యంగ్ హీరోలు విశ్వక్సేన్, జొన్నలగడ్డ సిద్ధు, దర్శకుడు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, హను రాఘవపూడి, శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ మీట్ లో యూనిట్ అంతా మాట్లాడారు. వేదిక మీద వచ్చిన అతిధులు అందరు సినిమా గురించి మరియు బాలకృష్ణ గారి గురించి మాట్లాడారు.